రేపటి నుంచి దేశీయ విమానాలు మొదలు అవుతున్న నేపధ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. కరోనా లక్షణాలు ఉన్న వారిని విమానాలు రైళ్ళు ఎక్కవద్దు ఆదేశాలు ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ప్రయాణికుడుకి ఆరోగ్య సేతు యాప్ తప్పని సరి అని స్పష్టం చేసింది. 

 

నిబంధనలను కచ్చితంగా టికెట్ వెనుక ముద్రించాలి అని స్పష్టం చేసింది. అదే విధంగా ప్రయాణికులకు ధర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని పేర్కొంది. ఓడలు విమానాల్లో వచ్చే వారికి కచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ అవసరమని పేర్కొంది. కరోనా లక్షణాలు ఉంటే జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1075 కి ఫోన్ చెయ్యాలని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: