దేశ వ్యాప్తంగా వలస కార్మికుల కష్టాలను తీర్చడానికి వారిని సొంత రాష్ట్రాలకు తరలించడానికి గానూ కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్ళను నడుపుతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా లక్షల మందిని ఇప్పుడు సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తరలిస్తుంది. ఇక వారికి ఆహారంలో కూడా ఏ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. 

 

ఇక ఇప్పటి వరకు వలస కార్మికులను తరలించడానికి గానూ... రైల్వే శాఖ 2818 ష్రామిక్ స్పెషల్ రైళ్లను ఇప్పటి వరకు నడిపింది. ఈ రోజు 565 రైళ్లు నడుస్తుండగా 60 రైళ్లు లైన్ లో ఉన్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. 2253 రైళ్లు తమ గమ్యస్థానానికి చేరుకున్నాయని... రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: