భోపాల్‌లో విషాద‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తనకు మొబైల్ ఇంటర్నెట్ ప్యాక్ రీఛార్జ్ చేయడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. *అతను తన తల్లిని తన ఇంటర్నెట్ ప్యాక్ రీఛార్జ్ చేయించాల‌ని నిరంతరం అడుగుతున్నాడు. అయితే అందుకు త‌ల్లి తిరస్కరించ‌డంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నాం* అని పోలీసులు వెల్ల‌డించారు.

 

ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా తీవ్ర‌విషాదం నెల‌కొంది. అయితే.. యువ‌త ఇంట‌ర్నెట్ ఎంత‌లా బానిస‌లుగా మారుతున్నార‌ని, అందుకే కుటుంబం క‌న్నా.. ఇంట‌ర్నెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ప‌లువురు విశ్లేష‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా పిల్ల‌ల‌కు ఈ విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌భుత్వాలు కృషి చేయాల‌ని సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: