ఉత్తర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు మించిపోయాయి. దీంతో భారత వాతావారణ శాఖ(ఐఎండీ) పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్తాన్, హరియాణా. చండీగడ్, ఢిల్లీలకు ఈ హెచ్చరిక వర్తిస్తుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసినట్టు ఐఎండీ పేర్కొంది. 
 
వడగాల్పులు వీచే ప్రమాదం ఉన్నందువల్ల ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటన చేసింది. వేసవి కాలంలో రెడ్ అలర్ట్ జారీ చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదని... ఇదే తొలిసారని ఐఎండీ పేర్కొంది. రాజస్తాన్ రాష్ట్రంలో అత్యధికంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ నెల 28 తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: