ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తైన సందర్భంగా మేధోమథన సదస్సును ఈరోజు నుండి నిర్వహిస్తున్నారు. జగన్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా 1,35,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రైతు భరోసా పథకంతో రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని... దేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు ఈ స్థాయిలో ప్రయోజనం చేకూరలేదని తెలిపారు. 
 
కరోనా నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు బాగా పని చేశారని తెలిపారు. రాష్ట్రంలో అర్హులందరికీ పథకాలు అందాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే 82.5 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపారు. ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని... అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల దగ్గరే ఉంచుతున్నామని... 2.65 లక్షల గ్రామ, వార్డ్ వాలంటీర్లను రాష్ట్రవ్యాప్తంగా నియమించామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: