ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గ్రామల రూపురేఖలు మారనున్నాయని అన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లోనే 54 రకాల మందులను అందుబాటులో ఉంచుతామని... ప్రతి విలేజ్ క్లినిక్ లో ఏ.ఎన్.ఎం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే మార్చి నెలలోపు విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు అవుతాయని... రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 
 
గ్రామాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు, మన పాలన - మీ సూచనలు పేరుతో ఐదు రోజులు సమీక్ష నిర్వహిస్తున్న జగన్ ఈరోజు లబ్ధిదారులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే పూర్తి చేశామని అన్నారు. కరోనా వల్ల కొన్ని కార్యక్రమాలు ఆగిపోయాయని... వాటికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: