ఏపీ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ  ప్రభుత్వ పాలన మొదలు పెట్టి సంవత్సరం  పూర్తయిన సందర్భంగా రాష్ట్ర సంక్షేమం పై తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల గురించి చెబుతూనే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గురించి కూడా వివరిస్తూ విమర్శలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్. 

 

 గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పేరిట ఏకంగా ఎనిమిది నెలల బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్ కు చెల్లించలేదని... దీంతో వారు పూర్తిగా వైద్య నిలిపివేయడంతో పేద ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆ బకాయిలు మొత్తం చెల్లించామని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ విషయంలో గత ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించింది అంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: