ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన - మీ సూచన పేరుతో మేధోమథన సదస్సును నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గత ఏడాదిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు ద్వారా 3.57 కోట్ల మందికి 40,139 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఖర్చు చేయలేదని తెలిపారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. 
 
రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని... గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం 14 లక్షల కొత్త లబ్ధిదారులు చేరారని చెప్పారు. మేనిఫెస్టోలోని 99 శాతం పథకాల అమలు జరిగిందని తెలిపారు. 1,000 రూపాయల పింఛన్ ను 2,250 రూపాయలకు పెంచామని అన్నారు. ఓటు వేయని వారికి కూడా పథకాలు అందాలని... కులం, మతం, పార్టీ తేడాల్లేకుండా పథకాల అమలు జరుగుతోందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: