ఏపీ సీం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన - మన సూచనలో భాగంగా ఈరోజు సంక్షేమంపై సదస్సు నిర్వహించారు. జగన్ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరగా గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలంకు చెందిన స్మైలీ అనే గృహిణి మాట్లాడారు. తాను వెంగళాపాలం గ్రామ సచివాలయంలో వాలంటీర్ గా పని చేస్తున్నానని... గత సంవత్సరం సీఎం జగన్ పాదయాత్రలో అనేక మంది కష్టాలను చూసి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని వాలంటీర్ల వ్యవస్థను తెచ్చారని అన్నారు. 
 
తాను పేదరికంలో పుట్టి చదువుకొని ఉద్యోగం లేక వంటింటికే పరిమితమైన గృహిణినని.. జగన్ 4 లక్షల ఉద్యోగాలు కల్పించి ఆ ఉద్యోగాలలో 50 శాతం కల్పించడం మహిళలకు గర్వ కారణం అన్నారు. మొదట్లో గ్రామ వాలంటీర్లా...? అంటూ చాలామంది చులకనగా మాట్లాడారని... కానీ ఏడాదిలోనే వాలంటీర్లంటే ప్రజల్లో సదభిప్రాయం ఏర్పడిందని... వాలంటీర్ల్ వ్యవస్థ ద్వారా కరోనా కష్ట కాలంలో ప్రజలందరికీ సేవ సేవ చేస్తున్నామని తెలిపారు. 
 
మాకు ఉద్యోగం వచ్చిన తరువాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా వీధిలోనే ఉద్యోగాలు కల్పించినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. మా గురించి మొదట్లో చాలా నీచంగా మాట్లాడారని... కానీ ఇప్పుడు వారికి గ్రామ వాలంటీర్ల గొప్పదనం తెలిసిందని అన్నారు. సీఎం జగన్ లాంటి సీఎం నెవ్వర్ బిఫోర్... నెవ్వర్ ఆఫ్టర్ అని స‌రిలేరు డైలాగ్‌తో జ‌గ‌న్‌ను స్మైలీ నవ్వించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: