యువతలో చాలా మంది రోజులో ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉంటారు. అయితే నిపుణులు మాత్రం ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్ వాడితే చాలా ప్రమాదమని చెబుతున్నారు. ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్ వాడే వారిలో వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ వాడే వారు రేడియేషన్ భారీన పడే అవకాశం ఉంది. తాజాగా బీజింగ్ లో ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్ వాడిన ఒక బాలుడు ఆస్పత్రిపాలయ్యాడు. 
 
బీజింగ్ కు చెందిన పదేళ్ల బాలుడు గత కొన్ని రోజుల నుంచి చెవి నొప్పితో బాధపడుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రిని తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు షాక్ కు గురయ్యారు బాలుడి చెవిలో దట్టంగా శిలీంధ్రాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల అతని చెవిలో బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ ఫంగస్ గా తెలిపారు. సుదీర్ఘంగా అందిస్తున్న చికిత్స వల్ల బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు చెబుతున్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: