దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం కరోనా వైరస్ తో ఢిల్లీ ఎయిమ్స్ లో పని చేసే సీనియర్ డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే తాజాగా మరో ఉద్యోగి కరోనా భారీన పడ్డారు. ఢిల్లీలో ఇప్పటికే కరోనా రోగులకు సేవలందిస్తున్న ఆసుపత్రుల్లోని పలువురు డాక్టర్లు, హెల్త్ వర్కర్లు కరోనాకు గురవుతున్న సంగతి తెలిసిందే. 
 
తాజా ఎయిమ్స్ లో కరోనా నిర్దారణ అయిన ఎయిమ్స్ ‌ శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ (58) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. ఎయిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌ రాజ్‌కుమార్ దేశ సేవలో మరో కరోనా యోధుడు ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. ఆస్పత్రిలో హైరిస్క్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ విధిగా కరోనా టెస్ట్‌లు నిర్వహించాలని ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కుల్దీప్‌ ధిగాన్‌ డిమాండ్ చేశారు. కాగా గత వారం ఎయిమ్స్‌ మెస్‌లో పనిచేసే ఓ కార్మికుడు కరోనా భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: