చిరంజీవి చిన్నకూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్  కలసి చేసి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో లోకళ్యాణ్ దేవ్ చపాతీలు తయారు చేస్తారు అయితే ఆ చపాతీలు కాస్త వివిధ రకాల ఆకారాలను సంతరించుకుంటాయి అయితే శ్రీజ ఈ చపాతీలగురించి వర్ణిస్తూ వాటి ఆకారాలు బట్టి తాము ఏయే ప్రదేశాలకు హాలిడే టూర్ కి వెళదాం అనుకున్నారో ఫన్నీ గా చమత్కారిస్తుంది.

IHG

 

అయితే కళ్యాణ్ దేవ్ మాత్రం చపాతీలు గుండ్రంగానే ఎందుకు ఉండాలి అని అడగడంతో ఈ వీడియో అసలు నేపథ్యం బయట పడుతుంది. శ్రీజ కూడా అందుకు కళ్యాణ్ దేవ్ తో ఏకీభవిస్తూ ..లాక్ డౌన్  నేపథ్యంలో వంట రాని వారు పలురకాలు గా చపాతీలు చేస్తూ ఉంటారు ..ఈ సమయం వారు ఎదుర్కొన్న సరదా సన్నివేశాలను తమకు పంపించడం ద్వారా వారు తమ స్టోరీ లో పోస్ట్ చేస్తాము అని చెప్పింది. అయితే #Annapuranaatta @AnnapurnaAtta  మరియు #WhyShouldAllChapatisBeRound అనే టాగ్ లతో పోస్ట్ చేయవలసింది గా ఈ వీడియో ద్వారా కోరారు ...  

మరింత సమాచారం తెలుసుకోండి: