దోస్త్ మేరా దోస్త్ తూహే మేరీ జాన్.. అన్నట్లు ఓ కాకి చేసిన మరో జీవికి చేసిన సహాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ప్రేమ, స్నేహం అనేది మనుషులకే కాదు ప్రాణం ఉన్న ప్రతీ జీవికి ఉంటుంది. అయితే సందర్భాన్ని బట్టి వాటి ప్రేమను బయటపెడతాయి వన్యప్రాణులు. ఇప్పుడా సందర్భం రానే వచ్చింది. రోడ్డు దాటలేని పరిస్థితిలో మినీ ముళ్లపంది ఉంది.  ఈ మద్య సోషల్ మీడియాలో ఇలాంటి సన్నివేశాలు కోకొల్లు గా వస్తున్నాయి. రోడ్డు దాటలేని పరిస్థితిలో చిన్న ముళ్లపంది ఉంది. మరి ఏమైందో కానీ అది అతి కష్టంపై రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుంది.  అసలే వాహనాలు ఎక్కువగా తిరిగే ప్రదేశం. డ్రైవర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ముళ్లపంది చనిపోయే అవకాశం ఉంది. అది గమనించిన ఓ కాకి ఆ ముళ్లపందివద్దకు వచ్చి తన ముక్కుతో నెట్టుకుంటూ ఆ చిన్న ముళ్లపందిని ముందుకు తోయడం మొదలు పెట్టింది.

 

అక్కడ అది ఆగినా.. దాన్ని మళ్లీ తన ముక్కుతో కదిపి ముందుకు నడిపించింది. ఇలా ముళ్లపందిని చివరి వరకు రోడ్డు క్రాస్‌ చేపిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. దీనిని ఓ యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. షేర్‌  చేసిన కాసేపటికే మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకున్నది. మనుషులకు ఈ మాత్రం సహాయ గుణం ఉంటే ప్రపంచం ఎంతో శాంతిగా ఉండేదని అంటున్నారు. కొంతమంది అయితే వన్యప్రాణుల నుంచి చాలా నేర్చుకోవాలి అంటుంటే.. నేను హెడ్జ్‌హాగ్‌.. కాకి నా అలారమ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: