ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజుల నుంచి వివాదంగా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం భూముల అమ్మకాల ప్రక్రియను ఏపీ సర్కార్ నిలిపివేసింది. 2016 జనవరి 30న టీటీడీ బోర్డు చేసిన తీర్మాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ సర్కార్. దీనిపై పెద్ద దుమారమే రేగింది. రాజకీయ పార్టీలు దీనిపై ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసాయి. 

 

2016 జనవరి 30 న చేసిన తీర్మానం లో 50 చోట్ల ఉన్న టీటీడీ భూములను అమ్మాలి అని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సమీక్ష చేసిన బోర్డ్ ఇటీవల ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. తమిళ నాడు లో ఉన్న 23 చోట్ల భూములను అమ్మాలని వాటి విలువ కోటి 50 లక్షలు గా  పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: