తీవ్ర దుమారం రేపుతున్న టీటీడీ భూముల అమ్మకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి 30 న టీటీడీ బోర్డ్ చేసిన తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. 50 చోట్ల భూములను అమ్మాలి అని తీర్మానం చేయగా ఇటీవల ఒక నోటిఫికేషన్ ని టీటీడీ విడుదల చేసింది. 

 

అయితే ఆధ్యాత్మిక వాదులు, ధర్మ ప్రచారుకులతో సంప్రదింపులు జరపాలని, సంప్రదింపులు పూర్తి అయ్యే వరకు వేలం ఆపాలని సర్కార్ స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలను దృష్టి లో పెట్టుకుని వ్యవహరించాలని టీటీడీ బోర్డ్ కి రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వాటిని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: