పవన్ కళ్యాణ్ కొద్దీ రోజుల గ్యాప్ తరువాత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకి మూలం హిందీలో హిట్ సాధించినఅమితాబచ్చన్ నటించినటువంటి పింక్ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా హిందీలో ఘనవిజయాన్ని సాధించింది, అయితే దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నూ తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సినిమా ప్రస్తుతం కొంత వరకు షూటింగ్ నూ పూర్తి చేసుకుంది .

 

తరువాత ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా కాస్త మూలాన పడడంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాని పునః ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ సినిమాని వచ్చే జులై నేలనుండి షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో పవన్ కి జోడిగా గబ్బర్సింగ్ భామ శృతి హాసన్ చేస్తున్నారు అయితే ఈమె కూడా లాయర్ క్యారెక్టర్ లో ప్రత్యేకంగా ఈ సీన్ లో 20 నిముషాలు శృతి హాసన్ కనిపించనుంది. చాలా రోజుల గ్యాప్తో ఈ సినిమా ప్రేక్షకులముందికి రానుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: