లాక్ డౌన్ పుణ్యమా అని అడవి జంతువులు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. దీనిపై ఇప్పుడు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరి కొందరికి మాత్రం వినోదంగా ఉంది అనేది వాస్తవం. ఇటీవల అడవి జంతువులు ఎక్కువగా మనుషులు ఉండే ప్రాంతాల్లోకి వచ్చి ఆందోళన కలిగిస్తున్నాయి. 

 

తాజాగా విశాఖ జిల్లాలో 15 అడుగుల తాచు పాము చుక్కలు చూపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని తమడపల్లి గ్రామంలోకి అడుగు పెట్టింది. ఈ కింగ్ కోబ్రా ను చూసిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో 15 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టుకుని చెరుకుపల్లి అడవిలోకి వదిలిపెట్టారు. దానిని చూసిన గ్రామస్తులు ముందు భయపడినా ఇంత పెద్ద పాముని చూడటం ఇదే మొదటి సారి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: