వివాహానికి ఈ పాస్ ఇవ్వకపోవడంతో ఒక జంట చెక్ పోస్ట్ వద్దే వివాహం చేసుకుంది. కేరళ రాష్ట్రం కొట్టాయం కారప్పుళ ప్రాంతానికి చెందిన గణేశన్‌ కుమార్తె గాయత్రి(19)కి తేని జిల్లా కంభంపుదుపట్టి సుబ్రమణ్యస్వామి ఆలయ వీధికి చెందిన రత్నం కుమారుడు ప్రశాంత్‌ (25)కు కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా వండిపెరియారు వాలార్డిలోని మారియమ్మన్‌ గుడిలో వివాహం జరిపించాలి అని భావించారు. 

 

కాని అది సాధ్యం కాలేదు. ఇరురాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కుమిలి చెక్‌పోస్ట్‌ సమీపంలోకి పెళ్లి దుస్తులతో వధూవరులు చేరుకున్నారు. వివాహానికి అనుమతి ఇవ్వాలని కోరినా సరే పోలీసులు ఈ పాస్ లేనిదే కుదరదు అని చెప్పడంతో చెక్ పోస్ట్ వద్దే వివాహం చేసుకున్నారు. కొత్త దంపతులకు పోలీసులు శుభాకాంక్షలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: