సెలెక్ట్ కమిటి ఏర్పాటుపై ఏపీ హైకోర్ట్ లో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిటీషన్ వేసారు. సెలెక్ట్ కమిటి ని ఏర్పాటు చెయ్యాలని ఆయన పిటీషన్ లో కోరారు. 8 మంది సభ్యులతో రాజధాని వికేంద్రీకరణ సిఆర్దియే బిల్లులపై సెలెక్ట్ కమిటి ని ఏర్పాటు చెయ్యాలని ఆయన కోరారు. మండలి చైర్మన్ ఆదేశాలను మండలి సెక్రటరి పట్టించుకోవడం లేదని నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

 

అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. దీపక్ రెడ్డి పిటీషన్ పై కాసేపట్లో ఏపీ హైకోర్ట్ విచారణ చేపట్టనుంది. కౌన్సిల్ తీర్మానం చేసినా సరే సెలెక్ట్ కమిటి ని ఏర్పాటు చేయడం లేదని అన్నారు. క్విడ్ ప్రో కో కింద మండలి సెక్రటరి పదవి కాలం పెంచారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: