లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు వేలాది చిన్న పెద్దా సంస్థలు రోడ్డున పడ్డాయి. ప్రముఖ సంస్థలు కూడా ఇప్పుడు ఉద్యోగులను కాపాడుకోలేక నానా కష్టాలు పడుతున్నాయి. ఓలా ఉబెర్ లాంటి సంస్థలు కూడా ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 

 

నష్టాలను భరించలేని సంస్థలు ఇప్పుడు ఆస్తుల నుంచి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉండటంతోనే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా 600 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉబెర్ నిర్ణయం తీసుకుంది. లాభాలు 90 శాతం వరకు పడిపోయాయి అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ ఒక ప్రకటన లో తెలిపింది. ఇటీవల ఓల కూడా ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: