దేశంలో కరోనా వైరస్ ప్రబలిపోతుంది.. దేశ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.  ఈ నేపథ్యంలో కరోనా ని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రవేశ పెట్టారు.  అప్పటి నుంచి రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించి పోయింది.  అయితే లాక్ డౌన్ సడలిస్తున్నా.. తమకు అన్ని వైపుల నుంచి తీరని నష్టాలు వస్తున్నాయని ఊబర్, ఓల ఇతర కంపెనీలు వాపోతున్నాయి.  ఈ ప్రభావం కోట్ల మంది ప్రైవేట్ ఉద్యోగులకు శాపంగా మారింది.  ఇప్పటికే పలు కంపెనీలు తమ ఎంప్లాయిస్ ని కుదిస్తూ వస్తున్నారు.  ఇక క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఉబ‌ర్ ఇండియా సంస్థపై ప‌డింది. త‌మ వ‌ద్ద ఫుల్‌టైమ్‌లో ప‌నిచేస్తున్న 600 మందిని తొల‌గిస్తున్న‌ట్లు ఉబ‌ర్ ఇండియా పేర్కొన్న‌ది.  దీంట్లో ఎక్కువ శాతం కారు డ్రైవ‌ర్లు, బైక్ రైడ‌ర్లు ఉన్నారు.  

 

అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా కొంత మంది తమ సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో వ్యాపారం దెబ్బ‌తిన్న‌ద‌ని, ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ఉబ‌ర్ ఇండియా అధ్య‌క్షుడు ప్ర‌దీప్ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలిపారు. కోవిడ్‌19 వ‌ల్ల త‌మ సిబ్బందిని త‌గ్గించుకోవాల్సి వ‌స్తుంద‌న్నారు. ఒక్క ఊబర్ మాత్రమే కాదు ట్రావెలింగ్ రంగంలో ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగస్తులను ఉద్యోగాల నుంచి తొలగించేందకు సిద్దమవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: