ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా 13 జిల్లాల నుంచి 24 మంది రైతులతో మేధోమథన సదస్సు నిర్వహించారు. చంద్రబాబు 2014 సంవత్సరం రుణమాఫీ అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారని... ఐదేళ్లలో చంద్రబాబు 15,000 కోట్ల రూపాయల రుణమాఫీ కూడా చేయలేదంటే రుణమాఫీ ఏ స్థాయిలో జరిగిందో సులభంగా తెలుసుకోవచ్చని సీఎం జగన్ అన్నారు. 
 
రాష్త్ఱంలో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతుల బకాయిలను కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రాష్ట్రంలో ఫామ్ ఆయిల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని... వారికి ఆదుకునేలా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడతామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధరల గురించి పూర్తి సమాచారం లభిస్తుందని తెలిపారు. ఈ నెల 30న రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: