గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో టీటీడీ భూముల అమ్మకం వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. భూములను అమ్మడంపై దేశ వ్యాప్తంగా హిందు ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఏ విధంగా భూములు అమ్ముతారని, టీటీడీ ఆదాయానికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉందని పలువురు నిలదీస్తున్నారు. 

 

ఇక ఇప్పుడు ఈ కేసు హైకోర్ట్ కి వెళ్ళింది. తిరుప‌తి భూముల అమ్మ‌కాల‌పై హైకోర్టులో విచార‌ణ‌ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు క‌రోనా ఉండగా భూములు అమ్ముకోవాల్సిన ఆగ‌త్యం ఏంట‌ని  రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ ప్రశ్న వేసింది. 45 నిమిషాల పాటు వాదోప‌వాదాలు జరిగాయి. ఈ నెల 28కు విచార‌ణ వాయిదా వేసింది హైకోర్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: