ఆంధ్రప్రదేశ్ రైతుల విషయంలో కరోనా వైరస్ ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే సిఎం వైఎస్ జగన్ వెనక్కు తగ్గడం లేదు. వారికి ఆర్ధిక సహాయం చేయడమే కాకుండా పంటలకు గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలను ఆయన చేస్తున్నారు. తాజాగా ఏడాదిగా వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

నాలుగేళ్ల‌కు బ‌దులుగా ఐదేళ్ల పాటు రైతు భ‌రోసా ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ ఖ‌రీఫ్ లో రైతుల‌కు 9 గంట‌ల ప‌గ‌టి పూట క‌రెంట్ ఇస్తామని అన్నారు జగన్. ఈ నెల 30న రైతు భ‌రోసా కేంద్రాలు ప్రారంభిస్తామని సిఎం స్పష్టం చేసారు. సేంద్రీయ వ్యవసాయం పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: