తెలంగాణాలో ఆలయాలకు అనుమతి ఇచ్చే విషయంలో తెలంగాణా సర్కార్ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మార్చ్ 22 నుంచి కరోనా కారణంగా ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం మూసి వేసింది. కేవలం పూజారులు మాత్రమే పూజలు చేస్తున్నారు గాని భక్తులకు ప్రవేశం లేదు. 

 

ఇక త్వరలో భక్తులకు అనుమతి ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిపై దేవాదాయ శాఖ మార్గదర్శకాలను సిద్దం చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసి జూన్ నుంచి భక్తులకు దేవాలయాలకు అనుమతులు ఇవ్వాలని భావిస్తుంది. త్వరలోనే కేబినేట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కేసీఆర్ ఇప్పటికే దేవాలయాలకు అనుమతించే విషయంలో సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: