అమెరికాలో తగ్గిన కరోనా వైరస్ ఇప్పుడు మన దేశం మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. మన దేశంలో నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కరోనా కేసులు ఇప్పుడు వేగంగా నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు కూడా దాదాపుగా 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇప్పుడు కలవరపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

ఎక్కువ టెస్ట్ లు చేస్తే కరోనా కట్టడి అవుతుందని భావించినా సరే అది మాత్రం సాధ్య౦ కావడం లేదు. దేశ వ్యాప్తంగా కరోన టెస్ట్ ల సంఖ్య భారీగా పెరిగింది. రోజు రోజుకి తీవ్రత పెరగడమే కాకుండా వేల సంఖ్యలో ఇప్పుడు కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. భారత్ లో కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికా తర్వాత భారత్ ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: