ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 49 మందికి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలను ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. జడ్జీలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను కోర్టులు తీవ్రంగా పరిగణిస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. 
 
 
న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తికి, రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సిందేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. వ్యక్తిగతంగా జడ్జీలను టార్గెట్ చేసే ధోరణిని కోర్టులు ఉపేక్షించవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు నోటీసులు జారీ చేయడంపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: