ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబెర్‌ను అమెరికా ఇటీవల విడుదల చేసిన అవకాశం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే అతన్ని ప్రత్యేక విమానంలో భారత్ కి పంపగా అతన్ని నేడు హైదరాబాద్ తీసుకొచ్చారు పోలీసులు. అల్వాల్‌లోని తన నివాసానికి జుబెర్‌ను పోలీసు అధికారులు తరలించారు. 2016లో అమెరికా అధికారులు అతన్ని ఉగ్రవాద ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

 

16 రోజుల క్రితం అమెరికా అధికారులు అతన్ని భారత్ కి పంపించారు. 14 రోజుల పాటు పంజాబ్ లోని అమృత్‌సర్‌లో క్వారంటైన్‌లో జుబెర్‌ను అధికారులు ఉంచిన సంగతి తెలిసిందే. క్వారంటైన్‌ పూర్తి అయిన నేపధ్యంలో హైదరాబాద్‌కు పోలీసులు తీసుకొచ్చి ఇంటికి పంపించారు. ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అతను నిధులు సేకరించాడు అనే ఆరోపణల నేపధ్యంలో అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: