ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ పై వైసీపీ నేతలు విమర్శలు చేయడాన్ని టీడీపీ లీగల్ సెల్ కి చెందిన గొట్టిపాటి రామకృష్ణ తప్పుబట్టారు. కోర్టు తీర్పులపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌ చేసుకోవచ్చని, న్యాయమూర్తులకు కులాలు, మతాలను అంటగట్టొద్దని హితవుపలికారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడొద్దని ఆయన సూచనలు చేసారు. న్యాయవ్యవస్థ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌ న్యాయవ్యవస్థను అవమానించడం బాధాకరమన్నారు. ఎంపీ పదవిలో ఉండటానికి నందిగం సురేష్‌ అనర్హుడని ఆరోపించారు. అధికారులు రాజకీయనాయకులకు గుత్తేదార్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా నందిగం సురేష్ సహా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: