టీటీడీ కి చెందిన ఆస్తులను అమ్మాలి అనుకోవడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఆస్తులను ఏ విధంగా అమ్మాలి అనుకుంటారు అంటూ ప్రభుత్వం పై అటు టీటీడీ పై విమర్శలు చేసాయి రాజకీయ పార్టీలు. ఇక ఏపీ సర్కార్ అమ్మవద్దు అని ఉత్తర్వులు ఇవ్వడంతో వెనక్కు తగ్గింది టీటీడీ. తాజాగా అమ్మడం లేదని ఉత్తర్వులు ఇచ్చింది. 

 

ఇక టీటీడీ ఆస్తులు అమ్మాలి అనేది తప్పుడు ఆలోచన అని తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపణలు చేసారు. టీటీడీ కి ఆస్తులను అమ్మే హక్కు లేదని ఆయన స్పష్టం చేసారు. ఆస్తులను అమ్మడ౦ అనేది మానుకోవాలని సూచించారు. కాగా నేటి మధ్యాహ్నం ప్రక్రియను ఆపెస్తున్నట్టు టీటీడీ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: