కరోనా రావడం ఏమో గాని ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆ పేరు వింటే చాలు భయపడే పరిస్థితి వచ్చింది. మన దేశంలో ఇప్పుడు కరోనా పేరుతో గ్రామాలు చాలా వరకు భయపడుతున్నాయి కూడా. ఇక తాజాగా కరోనా వైరస్ తో ఒక యువకుడ్ని గ్రామస్తులు కారులోనే క్వారంటైన్ చేసారు. ఓడిశా లోని పాత్రో అనే ఒక ఫోటో గ్రాఫర్ ఇటీవల బీహార్ వెళ్లి వచ్చాడు. 

 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అతను క్వారంటైన్ లో ఉండాలి. జిల్లా క్వారంటైన్ లో అతను 14 రోజుల పాటు ఉన్నాడు. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా అతనిని క్వారంటైన్ లో ఉండాలని గ్రామస్తులు వేధించారు. అధికారులు చెప్పినా ఎవరు చెప్పినా వినలేదు. చివరికి గ్రామ సర్పంచ్ తో కూడా చెప్పించి క్వారంటైన్ లో ఉంచాలి అంటే కాదు అని తన కారులోనే క్వారంటైన్ లో ఉండటానికి ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: