గంగూలి నుంచి వచ్చిన సహకారం తనకు ధోని నుంచి విరాట్ కోహ్లీ నుంచి రాలేదని టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ధోనికి సురేష్ రైనా అంటే అభిమానం అని అందుకే అవకాశాలు ఇచ్చాడు అని కామెంట్స్ చేయగా దీనిపై సురేష్ రైనా స్పందించాడు. 

 

అవును ఎంఎస్ ధోనీ తనకు మద్దతు ఇచ్చాడని... ఎందుకంటే నాలో టాలెంట్ ఉందని తనకు తెలుసన్నాడు. ధోనీకి నాపై నమ్మకం ఉందని... అది సీఎస్‌కేలో అయినా.. అది టీం ఇండియాలో అయినా అవకాశం ఇచ్చాడని అన్నాడు. ఇక మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలుసన్నాడు. ఒక్కొసారి 10 ఓవర్లే ఆడాలని... ఒక్కసారి 30 ఓవర్లు ఆడాలని... మా స్థానం వేరుగా ఉంటుందన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: