ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి ఫైర్ అయింది. యుద్ద నిబంధనలను ఆదేశం అతిక్రమించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 3వ తేదీన డీ మిలటరైజ్డ్ జోన్(కొరియా దేశాల సరిహద్దు ప్రాంతం) వద్ద దక్షిణ కొరియా సేనలపై ఉత్తర కొరియా సైనికులు కాల్పులు జరిపాయని... అదే విధంగా దీనికి స్పందనగా దక్షిణ కొరియా కూడా కాలుపకు దిగింది అని... 

 

మొదట ఉత్తర కొరియానే నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిందని... అప్పుడు దక్షిణ కొరియా రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తాజాగా వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ విధంగా కాల్పులు జరిపి ఇరుదేశాలు 1950-53లో పరస్పరం చేసుకున్న ఆర్మిస్టైస్(యుద్ధ నియంత్రణ ఒప్పందం) ఒప్పందాన్ని అతిక్రమించాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు దక్షిణ కొరియా మాత్రమే సహకరించింది అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: