అమెరికాలో కరోనా మరణాలు వందల్లోకి వచ్చేసాయి. వేల నుంచి కరోనా మరణాలు వేలల్లోకి రావడం  ఇప్పుడు అమెరికన్లను కాస్త ఊపిరి పీల్చుకునే విధంగా చేస్తుంది. అయితే దేశంలో కరోనా కేసులు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి. వేల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 

 

ఇక తాజాగా జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, వరుసగా మూడవ రోజు 700 మంది అమెరికాలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 98,875 గా ఉందని AFP వార్తా సంస్థ తెలిపింది. దేశ వ్యాప్తంగా మరణాలు తగ్గడమే కాకుండా కేసులు కూడా తగ్గుతున్నాయని అమెరికా ప్రభుత్వం అంటుంది. న్యూయార్క్ లో భారీగా కేసులు తగ్గాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: