తెలంగాణా సిఎం నేడు మరోసారి అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లో సిటీ బస్సులను మెట్రో సహా పలు పట్టణాల్లో షాపింగ్ మాల్స్ ని అనుమతి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

 

అదే విధంగా సినిమా షూటింగ్ లకు సంబంధించి కూడా నేడు ప్రకటన వచ్చే సూచనలు  కనపడుతున్నాయి. ఇప్పటికే సినీ పెద్దలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. లాక్ డౌన్ ని మరోసారి పెంచాలి అనే ఆలోచనలో సిఎం ఉన్నారు. కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చి ఆయన లాక్ డౌన్ ని పెంచడంపై ప్రకటన చేసే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: