ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎన్నో దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ మాత్రం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. ఇక ఇప్పుడు దీనిని ఆస్ట్రేలియా లో తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అమెరికా బయోటెక్నాలజీ సంస్థ నోవావ్యాక్స్‌ ఒక ప్రకటన చేసింది. 

 

ఎన్‌వీఎక్స్‌-కోవ్‌2373 అనే పేరుతో వస్తున్న ఈ వ్యాక్సిన్ ని ఈ ఏడాది చివర్లో ప్రయోగాలు పూర్తి చేసి విడుదల చేస్తామని నోవావ్యాక్స్‌ పరిశోధన విభాగం అధిపతి గ్రెగోరి గ్లెన్‌ మీడియాకు వివరించారు. మంగళవారం దీనిని మనుషులకు కూడా ఇచ్చారు. మొదటి దశలో మొత్తం 131 మందికి ఇస్తామని ఆయన మీడియా కు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: