ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా గబ్బిలం అనే పేరు వింటే చాలు భయపడే పరిస్థితి వచ్చింది. గబ్బిలం నుంచి కరోనా వైరస్ సోకుతుంది అనే ఆందోళన ఇప్పుడు ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో గబ్బిలాలు తినడం తోనే కరోనా వచ్చింది అనేది కొందరి నమ్మకం కూడా. ఇక ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్ లో ఒక పరిణామం చోటు చేసుకుంది. 

 

ఆ రాష్ట్రంలో గబ్బిలాలు వరుసగా చనిపోతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బేల్‌ఘాట్‌ గ్రామంలో గబ్బిలాలు చనిపోతున్నాయి. వాటి నుంచి ఎక్కడ కరోనా వస్తుందో అని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. అయితే అధిక ఉష్ణోగ్రత, తాగునీరు దొరక్కపోవడంతోనే గబ్బిలాలు చనిపోయి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు మీడియాకు వివరించారు. మరణించిన వాటిపై పరిక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: