భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణ౦ నెలకొంది. సైన్యాన్ని మొహరించిన చైనా అధ్యక్షుడు... యుద్దానికి సిద్దంగా ఉండాలని సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ త్సో, గాల్వాన్‌ లోయ, డెమ్‌చోక్‌, దౌలత్‌బెగ్‌ ఓల్దీ ప్రాంతాలకు సమీపంలో చైనా సైన్యం భారీగా మోహరించింది. 

 

దీనితో అప్రమత్తమైన భారత ఆర్మీ... భారీగా సైన్యాన్ని ఆ ప్రాంతానికి తరలించింది. 2017 డోక్లాం ప్రతిష్ఠంభన తర్వాత లద్దాక్‌ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల మధ్య ఈ పరిస్థితులు తలెత్తాయి. చైనా ఆ ప్రాంతంలో భారీగా యుద్ద విమానాలను కూడా మోహరించింది అని వార్తలు వస్తున్నాయి. ఏ సమయంలో అయినా సరే దాడులకు భారత ఆర్మీ సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చైనా వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: