ఏడాది కాలంలోనే సర్కార్ దివాళా తీసిందా అంటూ హైకోర్ట్ ప్రశ్నించిందా అంటూ బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన కన్నా ఈ వ్యాఖ్యలు చేసారు. జగన్ నవరత్నాలు అని చెప్తూ ప్రజలపై అధికభారం వేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసి మద్యం కరెంట్ చార్జీలను దారుణంగా పెంచారని... అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకుండానే భూములను అమ్మేశారని మండిపడ్డారు. 

 

వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, నిర్ణయాలు, కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజా పాలన లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి, నాయకులకు ప్రజలంటే గౌరవంలేదని, ప్రతిపక్షాలంటే అంతకంటే గౌరవంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.  చట్టాలు, చట్టసభలపై కూడా గౌరవంలేదని ఆయన ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: