ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన మీ సూచన సదస్సులో భాగంగా లబ్ధిదారులతో మాట్లాడారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను తాను ప్రత్యక్షంగా చూశానని సీఎం అన్నారు. చాలా మంది మన పిల్లలను తెలుగు మీడియంలో చదివించమని చెబుతున్నారని... కానీ వారు మాత్రం వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నారని అదిరిపోయే కౌంట‌ర్‌ ఇచ్చారు. పేదరిక నిర్మూలనకు ఉన్న ఏకైక మార్గం చదువు మాత్రమేనని సీఎం అన్నారు. 
 
బ్రిక్స్ దేశాలతో మనం చదువు విషయంలో చాలా వెనుకబడి ఉన్నామని సీఎం అన్నారు. చదివించే స్థోమత లేక చాలామంది తమ పిల్లల చదువును మాన్పించేస్తున్నారని అన్నారు. పాదయాత్ర సమయంలో తల్లిదండ్రులు పిల్లలను చదివించలేక పడుతున్న ఇబ్బందులను తాను స్వయంగా చూశానని సీఎం జగన్ అన్నారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: