ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తైన సందర్భంగా అన్ని రంగాల గురించి సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈరోజు లబ్ధిదారులతో నిర్వహించిన సదస్సులో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంకు 96 శాతం మంది అంగీకాఅరం తెలిపారని అన్నారు. ప్రతి ఊరిలో అన్ని స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంగా మారుస్తూ ఒక పాఠశాలను మాత్రం తెలుగు మీడియం అందుబాటులో ఉండేలా చేస్తామని అన్నారు. 
 
ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుందని చెప్పారు. రాష్ట్రంలో 47, 656 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని... 15,715 పాఠశాలల్లో తొలి విడతగా నాడు నేడు పథకంలో భాగంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను ప్రభుత్వం మార్చనుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: