ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన మన సూచనలో భాగంగా ఈరోజు విద్యా రంగం గురించి సదస్సు నిర్వహించారు. జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా విద్యార్థులకు పాఠశాలకు వచ్చిన రోజునే కిట్లను అందజేస్తామని అన్నారు. ఈ కిట్ల ద్వారా స్కూల్ బ్యాగ్, మూడు జతల  యూనిఫాం, బుక్స్, షూలు, సాక్సులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందజేస్తామని అన్నారు. పేదవాళ్ల పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్థితి రాష్ట్రంలో రావాలని చెప్పారు. 
 
ఏపీ విద్యార్థులు గ్లోబల్ సిటిజన్స్ గా మారేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ఈ ఏడాది నుంచి జగనన్న విద్యాదీవెన పథకం అమలులో ఉంటుందని అన్నారు. ఏవైనా మార్పులు చేసే సమయంలో మొదట్లో కొన్ని సమస్యలు వస్తాయని అన్నారు. ఆంగ్ల బోధనకు సంబంధించి టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: