కరోనా మహమ్మారి విజృంభణతో ప్రముఖ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కార్యాలయాలను నడుపుతున్నాయి. దానికి తగ్గట్టుగానే భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తున్నాయి. తాజాగా భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా గూగుల్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జులై 6వ తేదీ నుంచి దశల వారీగా ప్రపంచంలో ఉన్న తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్టు గూగుల్ నుంచి ప్రకటన వెలువడింది. 
 
ఈ సంవత్సరం చివరి వరకు చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే అవకాశం ఉందని పరికరాలు, ఫర్నిచర్ కోసం 1000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో 70 వేల రూపాయలు) భత్యంగా ఇస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఆఫీసులకు రావాల్సిన ఉద్యోగులకు జూన్ పదో తేదీలోగా మేనేజర్లు సమాచారం ఇస్తారని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: