కేంద్రం మరో నాలుగు రోజుల్లో నాలుగో విడత లాక్ డౌన్ ముగియనుండగా లాక్ డౌన్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు గత ఆరు రోజుల నుంచి ఆరు వేలకు పైగా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. అయితే కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ తర్వాత ఆంక్షల కొనసాగింపు రాష్ట్రాల ఇష్టాయిష్టాలకు వదిలేయనున్నట్టు సమాచారం అందుతోంది. 
 
అంతర్జాతీయ విమాన సర్వీసులు, విద్యా సంస్థల పునఃప్రారంభం లాంటి కీలక విషయాల్లో మాత్రం కేంద్రం నిర్ణయాలను రాష్ట్రాలు అనుసరించాల్సి ఉంటుంది. లాక్ డౌన్ తర్వాత కేంద్రం చిన్ని చిన్న అంశాలకు పరిమితం మాత్రమే పరిమితం కానుందని తెలుస్తోంది. సామూహిక మత ప్రార్ధనలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, క్లబ్స్, జిమ్స్‌పై మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: