దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పాక్ నుంచి దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు భారత్ లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని లక్షల ఎకరాల పంటను మిడతలు ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా మిడతల దండు మహారాష్ట్రలోని అమరావతిలోకి ప్రవేశించింది. 
 
మహారాష్ట్రలో మిడతల నియంత్రణ సాధ్యం కాకపోతే ఆ రాష్ట్రం నుంచి మిడతల దండు తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు అప్రమత్తమై సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. గంటకు 15 కిలోమీటర్ల మిడతల దండు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి సూచించారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: