ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 34 పథకాలు రద్దు చేసారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 70 శాతం పూర్తి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేసారని ఆయన, గోదావరి కృష్ణా పెన్నా ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసారు అని చంద్రబాబు దుమ్మెత్తిపోశారు. గత ప్రభుత్వం మొదలు పెట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా ఆపేసారని, 

 

కరోనా కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా  విఫలం అయిందని, బ్లీచింగ్, పారాసిటమాల్ అంటూ సమయం వృధా చేసారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఎల్జీ పాలిమర్స్ కి ప్రభుత్వం వంత పాడుతుందని అన్నారు. అసలు కంపెనీ తరుపున ప్రభుత్వం పరిహారం ఇవ్వడం ఏంటీ అంటూ నిలదీశారు. టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలను పెంచలేదని అన్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: