లాక్ డౌన్ పై తెలంగాణా సిఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. అయితే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది పూర్తి స్థాయిలో తెలియదు. సమావేశం ముగిసిన తర్వాత ఆయన వెంటనే చినజీయర్ స్వామీజీ ఆశ్రమం వద్దకు బయల్దేరి వెళ్ళారు. ఎల్లుండి జరిగే యాగాలకు ఆయన చినజీయర్ ని ఆహ్వాని౦చడానికి వెళ్ళారు. 

 

తెలంగాణా నుంచే అత్యధికంగా ధాన్యం సేకరణ జరిగిందని, దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణా ఎదగడ౦ గర్వంగా ఆందని ఆయన పేర్కొన్నారు. రైతులు అందరికి తాను శుభాకాంక్షలు చెప్తున్నా అని అన్నారు. సాగునీటి లభ్యత తో పాటుగా ఉచిత విద్యుత్ తో ఇది సాధ్యం అయిందని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ముచ్చింతల్ కి చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: