గత కొన్ని రోజుగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతు న్నాయి.  ఓ వైపు కరోనా మహమ్మారి తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.  ఇటీవల విశాఖ పట్నం లో గ్యాస్ లీక్ వ్యవహారం.. మరోవైపు కరోనా పై లెక్కలు తప్పని.. ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని.. విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.  తాాజాగా తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈరోజు మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ విశాఖలో భూములను కబ్జా చేస్తున్నారని... సింహాచలం భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు గురువింద సామెంతను గుర్తుకు తెస్తున్నాయని అన్నారు.

 

అయితే తెలుగు దేశం పార్టీ నేతలు ఎలా పడితే అలా విమర్శిస్తున్నారని.. నిజా నిజాలు తెలియకుండా వారే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గజం స్థలం కబ్జా చేసినట్టు నిరూపించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయాన్ని మహానాడులో సమీక్ష చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానేసి, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు సహకరించాలని చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్ తో ప్రజలు కష్టాలు పడుతున్నారని.. అలాంటిది ప్రజలకు ధైర్యం చెప్పాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: