IHG

వైసీపీ కి వ్యతిరేకంగా హై కోర్ట్ తీర్పును వెలువరించడంతో వైసీపీ కార్యకర్తలు తీర్పు ను జీర్ణించుకోలేక ఆ తీర్పు  ఇచ్చిన జడ్జి పై మరియు న్యాయమూర్తులపై తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పించారు. అనుకున్నదే తడవుగా వారిపై సోషల్ మాధ్యమాల ద్వారా వారిపై విమర్శలు చేసారు. జడ్జి లను టార్గెట్ చేస్తూ వారి అంతు చూస్తాం అని చెప్పడంతో పాటు. చంద్రబాబు కులం వారి కులం ఒక్కటే అంటూ కులం రాజకీయాన్ని అంటగట్టే ప్రయత్నం చేసారని  హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కక్ష్య పూరితంగా వ్యాఖ్యలు చేయడం చూసి చాలా మంది విస్తుపోయారు కూడా.

 

 

ఈ కేసును హై కోర్ట్ సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది. అయితే ఈ కేసులో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సహా… చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. మొత్తం 49 మంది వైసీపీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్నీ గ్రహించిన కొందరు తమ సోషల్ మీడియా అకౌంట్ లను డిలీట్ చేసారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టంలోని 67 సెక్షన్, ఐపీసీలోని 153(A), 505(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. దరిశ కిషోర్‌రెడ్డిపై సీఐడీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మరి పోలీసులు వారిపై ఏ చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: