IHG

 

లాక్ డౌన్ ముగియనుంది. మరో రెండు మూడు వారాల్లో షూటింగ్ లు మొదలు కాబోతున్నాయి. ఇండస్ట్రీలో పెద్దసినిమాలు అయినటువంటి ఆర్ఆర్ఆర్ , ఆచార్య, వకీల్ సాబ్ వంటి సినిమాలు షూటింగ్ కోసం తమ షూటింగ్ షెడ్యూలును తయారు చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే లాక్ డౌన్ ఎత్తి వేస్తారో వెంటనే ఆయా  షెడ్యూల్ లలో సినిమా షూటింగ్ లను జరపనున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఆచార్య సినిమా షూటింగ్ ని మాత్రం రాజమౌళి చేతిలో పెట్టింది ఆ సినిమా యంత్రాంగం. అయితే ఆ సినిమాకి సంబంధించి ఓ కీలక నిర్ణయాన్ని రాజమౌళి తీసుకోవలసి ఉంది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> to release on 14 Aug ...

రాజమౌళి ఓకే చెబితే ఆ షూటింగ్ స్టార్ట్ అవుతుంది లేకపోతే ఆ షూటింగ్ కాస్త ఆగిపోయినట్టే. ఆచార్య సినిమాలోని ఓ ముఖ్యమైన పాత్రకి రామ్ చరణ్ అవసరం ఉంది. రామ్ చరణ్ లేకపోతే ఆ సినిమా షూటింగ్ ఆగిపోతుంది. రామ్ చరణ్ ఆ సీన్ కోసం 30 రోజులు కేటాయించవలసి ఉంటుంది. రాజమౌళి రామ్ చరణ్ ని ఆచార్య కోసం పంపిస్తే ఆర్ఆర్ఆర్ సినిమా కాస్త లేట్ అవుతుంది. అయితే రాజమౌళి ఇంకా ఓకే చెప్పలేదు. రాజా మౌళి నిర్ణయం కోసం ఆచార్య టీమ్ ఎదురు చూస్తూవుంది. అయితే సినిమా రిలీజ్ విషయం లో కూడా రాజమౌళి నిర్ణయమే కీలకం. ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి రిలీజ్ నుండి తప్పుకుంటే ఆచార్య ను  ఆ డేట్ కి రిలీజ్ చేయాలనీ నిర్మాతలు అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: